Social 1080×1350 • Multi-page
11-06-2025 BREAKING NEWS 05:26 PM
swarnodayam.com
Telugu Daily News

ఉద్యమ కళాకారులకు న్యాయం చేయాలి.. – తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు, రచయిత, గాయకుడు నేర్నాల కిషోర్

ఉద్యమ కళాకారులకు న్యాయం చేయాలి.. – తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు, రచయిత, గాయకుడు నేర్నాల కిషోర్
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ కళాకారులకు న్యాయం చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు, రచయిత, గాయకుడు నేర్నాల కిషోర్ లు అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించాక చాలామంది కళాకారులకు న్యాయం జరుగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సీఎం రేవంత్ రెడ్డి కళాకారులను ఆదుకుని ఉద్యోగాలు కల్పించాలని వారు కోరారు. తెలంగాణ ఉద్యమం కరీంనగర్ కేంద్రంగానే బలపడిందని, అందుకే ఈ నెల 15న ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు కరీంనగర్ కళా భారతిలో జరిగే ‘ పాటల పల్లకిలో 12 గంటలు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మేధావులు, కళాకారులు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమ పోస్టర్ ను వారు హుజురాబాద్ లో కళాకారులు చక్రాల రఘు, సందమల్ల నరేష్, యాకన్న, జంగ అనిల్, పిట్టల రమేష్, విష్ణు, ఆరూరి రాజు, నగేష్, జంపన్న, బుర్రగడ్డ రవి, గుమ్మడి జలపతిలతో కలిసి ఆవిష్కరించారు.

పాటల పల్లకిలో 12 గంటలు’ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న టీజేఎస్ ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు, రచయిత, గాయకుడు నేర్నాల కిషోర్, కళాకారులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!