Social 1080×1350 • Multi-page
11-06-2025 BREAKING NEWS 08:34 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా గౌడ సంఘ ఆధ్వర్యంలో పోచమ్మ, ఎల్లమ్మ తల్లి బోనాలు

ఘనంగా గౌడ సంఘ ఆధ్వర్యంలో పోచమ్మ, ఎల్లమ్మ తల్లి బోనాలు
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండల పరిధిలోని ఏడాదికి ఒకసారి నిర్వహించే జాతరలో భాగంగా ఇప్పలనర్సింగాపూర్, కాట్రపల్లి తదితర, వివిధ గ్రామలలో ప్రజలు పోచమ్మ,ఎల్లమ్మ తల్లుల బోనాలను డప్పు చప్పుళ్ళ మధ్య, డీజే భక్తి పాటలతో యువకుల పిల్లలు, యువకుల నృత్యాలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు దీప ధూపలతో పాటు మహిళలు బోనంలో తెచ్చిన నైవేద్యాన్ని సమర్పించి దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే మహిమ గల తల్లులు అని మహిళలు కొనియాడారు. ఆ తల్లుల ఆశీర్వాదం గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలందరూ పాడిపంటలు, అష్టైశ్వర్యాలలు, పిల్లాపాపలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లను దర్శించుకుని కోరుకున్నారు. ఈ జాతరలో పలు ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు మొక్కులు చెల్లించుకుని దర్శించుకున్నారు.

ఇప్పల నర్సింగాపూర్ గ్రామంలో బోనాలు సమర్పిస్తున్న భక్తులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!