Social 1080×1350 • Multi-page
12-06-2025 BREAKING NEWS 03:42 PM
swarnodayam.com
Telugu Daily News

ఉర్దూ మీడియం పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వాళ్ళ భవిష్యత్తుకు నాంది పలకండి… – తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్

ఉర్దూ మీడియం పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వాళ్ళ భవిష్యత్తుకు నాంది పలకండి… – తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్
IMG-20250612-WA0115

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణం ఉర్దూ భవన్ ఏరియాలో బడిబాట కార్యక్రమాన్ని సభాధ్యక్షులు కైరునిస బేగం అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ హాజరై మాట్లాడుతూ ఉర్దూ మీడియం పాఠశాలలో బాల బాలికల పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తును చక్కదిద్దవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంటుందన్నారు. పిల్లలను బడికి పంపించినట్టయితే వాళ్లు చదువుకొని బాగుపడతారనీ అలాంటప్పుడు వాళ్లను చదివించవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉంటుందని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సూచించారు. ఉర్దూ మీడియం పాఠశాలలలో చదువుకున్న పిల్లలకు ఉచితముగా రాష్ట్ర ప్రభుత్వం డ్రెస్సెస్, షూస్, పుస్తకాలు, భోజనం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందనీ, మీ పిల్లలను ఉర్దూ మీడియం పాఠశాలల్లో చేర్పించండి అని పిలుపునిచ్చారు. పిల్లలు చదువుకున్న తర్వాత వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రవేట్ కంపెనీలలో పని చేయడానికి అన్ని అర్హతలు వారికి ఉంటాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రెండవ అధికార భాష ఉర్దూ ఉంది కనుక ఉర్దూ మీడియం పాఠశాలల్లో చదివే పిల్లలకు ఇంగ్లీషు, మ్యాస్, సోషల్, సైన్స్, తెలుగు అన్ని భాషలు పిల్లలకు రావడానికి అవకాశం ఉందనీ ఇంత మంచి సౌకర్యాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినప్పుడు మీ పిల్లలను ఉర్దూ మీడియం పాఠశాలల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తల్లితండ్రులకు బడిబాట ర్యాలీ సందర్భంగా పిలుపుచ్చారు. ఈ కార్యక్రమంలో కైరునిస బేగం, బి ఉమాదేవి, గులాబ్ మైనుద్దీన్, తమన్నా, బిస్మిల్లా భాను, అంజు తరహానా, తక్కలమ్మ లతోపాటు బాల బాలికల తల్లితండ్రులు బడిబాట ర్యాలీలో పాల్గొన్నారు.

విద్యార్థులు, తల్లిదండ్రుల ఉద్దేశించి మాట్లాడుతున్న ముజాహిద్ హుస్సేన్..
Oplus_131072

బడిబాడ కార్యక్రమానికి హాజరైన ముస్లిం విద్యార్థులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!