Social 1080×1350 • Multi-page
12-06-2025 BREAKING NEWS 04:55 PM
swarnodayam.com
Telugu Daily News

కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు సరైన న్యాయం, పథకాల లబ్ధి లబ్ది.. కాంగ్రెస్ నేత ప్రణవ్..

కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు సరైన న్యాయం, పథకాల లబ్ధి లబ్ది.. కాంగ్రెస్ నేత ప్రణవ్..
IMG-20250612-WA0178

– పట్టణాల్లో, గ్రామాల్లో పండగలా ముగ్గు పోసే కార్యక్రమం..

– పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలను అందజేసిన ప్రణవ్.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేస్తామని, పదేళ్ల నిరీక్షణ తర్వాత గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేసే కార్యక్రమానికి హాజరవుతుండడంతో లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. హుజురాబాద్ మండలం సింగాపూర్, జూపాక గ్రామాల్లో 20 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులు మిఠాయిలు పంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి, మంత్రులకు, నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ పదేళ్లలో ఇళ్లు, రేషన్ కార్డు ఇవ్వాలని ప్రజల నుండి డిమాండ్ వచ్చిన వాటిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులను గుర్తించి రాజకీయలకు అతీతంగా ఇల్లు ఇస్తున్నామని అన్నారు. మొదటి విడతలో ఇళ్లు రాని వారు రానున్న 3 నెలల్లో మరో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం కొనసాగుతుందని ఎవరు అధైర్య పడద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో…

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో గల 14 వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు ప్రణవ్.. ప్రజలు ప్రభుత్వం సూచించిన నియమాలు పాటిస్తూ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రణవ్ బాబును ఆలింగనం చేసుకొని కృతజ్ఞతలు తెలుపుతున్న వృద్ధురాలు..

ప్రణవ్ బాబుకు ప్రేమతో నమస్కరిస్తున్న వృద్ధురాలు..

జూపాకలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అందజేస్తున్న ప్రణవ్ బాబు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!