Social 1080×1350 • Multi-page
12-06-2025 BREAKING NEWS 05:28 PM
swarnodayam.com
Telugu Daily News

శ్రీసరస్వతి శిశు మందిరాలు సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలు…- టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి మాన్యశ్రీ లింగం సుధాకర్ రెడ్డి.

శ్రీసరస్వతి శిశు మందిరాలు సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలు…- టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి మాన్యశ్రీ లింగం సుధాకర్ రెడ్డి.
IMG_20250612_172303

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): జమ్మికుంట పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ నూతనభవ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర కార్యదర్శి లింగం సుధాకర్ పాల్గొని మాట్లాడుతూ దేశంలోనే శ్రీ సరస్వతీ శిశు మందిరాలు మన సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలని అలాంటి సంస్థలను మనం కాపాడుకున్నప్పుడే మన మనుగడ ఉంటుందని తెలిపారు. పూర్వ విద్యార్థుల ఆధారంగా మరియు ,పోషకుల ఆధారంగా విద్యతో పాటు అభివృద్ధి కూడా సాధిస్తున్నామని అందులో భాగంగానే ఈరోజు జమ్మికుంట పట్టణంలో నూతన ప్రారంభించామని వారు అన్నారు.
రానున్న రోజుల్లో కార్పొరేట్ విద్యకు అనుగుణంగా శ్రీ సరస్వతీ శిశు మందిరాలను తీర్చిదిద్దామని ఏ అవసరం ఉన్న నాకు తెలియచేయాలని ఎమ్మెల్సీ కొమురయ్య గారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల విద్యాధికారి మంతెన హేమలత, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు, పూర్వ విద్యార్థి సునీత శ్రీ సరస్వతీ విద్యాపీఠ సంఘటన కార్యదర్శి మాన్యశ్రీ పతకమూరి శ్రీనివాసరావు, తేళ్ళ రాజమౌళి, కాటం రవీందర్, డాక్టర్ చిట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆవాల రాజారెడ్డి, గంగాడి కృష్ణారెడ్డి, కర్ర సంజీవరెడ్డి, ఆకుల రాజేందర్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!