12-06-2025 NORMAL NEWS 09:28 PM
swarnodayam.com
Telugu Daily News
12-06-2025 09:28 PM By Mandala Yadagiri

కాంగ్రెస్ లో చేరిన జమ్మికుంట, కమలాపూర్ నాయకులు…కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం..దళితులను మోసం చేసిన వ్యక్తి కౌశిక్ రెడ్డి.

కాంగ్రెస్ లో చేరిన జమ్మికుంట, కమలాపూర్ నాయకులు…కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం..దళితులను మోసం చేసిన వ్యక్తి కౌశిక్ రెడ్డి.
IMG-20250612-WA0251

ప్రభుత్వానికి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక కేటిఆర్ ఫ్రస్టేట్ అయి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.

త్వరలో బీఆర్ఎస్ నుండి మరిన్ని చేరికలు.బీఆర్ఎస్ నాయకులు టచ్ లో ఉన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం..

కవిత చెప్పిన దయ్యాల్లో కౌశిక్ రెడ్డి ఒకరు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, ఓపిక కూడా హద్దు ఉంటుందని, క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇన్ని రోజులు సంయమనం పాటించారని ఇంకోసారి ఇలాంటి అనుచిత, చిల్లర మాటలు మాట్లాడితే గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిరగనియ్యమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. గురువారం రోజున హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ సమక్షంలో 100కుపైగా మంది జమ్మికుంట మండలం, కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, పలువురు నాయకులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు, ప్రణవ్ ఆలోచనలకు ఆక్షరితులమై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకువెళ్లారని, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణకు కేసీఆర్ హాజరు అయితే కేటీఆర్ ఎందుకు ఆగం ఆగం అయితున్నాడని, తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. స్వయాన కేసీఆర్ కూతురు కవిత చెప్పినట్లుగా పార్టీలో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఎప్పుడూ కేసీఆర్ చుట్టూ తిరిగే కౌశిక్ రెడ్డి పెద్ద దయ్యం అని అన్నారు. రీల్స్ చేయడం మానేసి రియల్ లైఫ్ లోకి రావాలని నియోజకవర్గ సమస్యలు గాలికి వదిలేసి బ్లాక్ మెయిల్, చిల్లర రాజకీయాలు మానేయాలని హితవు పలికారు. కౌశిక్ రెడ్డి చుట్టూ తిరిగే నాయకులే మాతో టచ్ లో ఉన్నారని త్వరలో బీఆర్ఎస్ నుండి మరిన్ని చేరికలు ఉంటాయని చెప్పారు. సంక్షేమ పథకాలకు ప్రజల్లో ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి మాటలు మాట్లాడటం మానుకోకపోతే గ్రామాల్లో తిరగనియ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట, కమలాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న నియోజకవర్గం ఇన్చార్జి ప్రణవ్
Oplus_131072
Oplus_131072

కాంగ్రెస్ పార్టీలో చేరిన జమ్మికుంట, కమలాపూర్ మండలాలకు చెందిన నాయకులతో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!