Social 1080×1350 • Multi-page
13-06-2025 BREAKING NEWS 08:36 PM
swarnodayam.com
Telugu Daily News

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం
IMG-20250613-WA0081

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం శుక్రవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులకు వైద్యాధికారులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. పలువురికి వైద్య పరీక్షల అనంతరం ఆరోగ్య సంరక్షణ కోసం పలు సలహాలు సూచనలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాలను కార్మికులు సద్వినియం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య, మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, ఏఈ సాంబరాజు, రషీద్, వైద్య సిబ్బంది విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్ష నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది..
వైద్య శిబిరాన్ని సందర్శించి పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!