Social 1080×1350 • Multi-page
15-06-2025 BREAKING NEWS 01:47 PM
swarnodayam.com
Telugu Daily News

ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యుల్.. – మొదటగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు! – కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యుల్.. – మొదటగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు! – కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Oplus_16908288

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యుల్ ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మొదటగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి సోమవారం క్యాబినెట్లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తాం అని అన్నారు. మొదటగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆశావాహులు ఇప్పటికైనా తమ ప్రక్రియను వేగవంతం చేయాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!