15-06-2025 NORMAL NEWS 10:30 PM
swarnodayam.com
Telugu Daily News
15-06-2025 10:30 PM By Mandala Yadagiri

42%శాతం రిజర్వేషన్ కోసం మరొకసారి ఆమరణ నిరహార దీక్ష చేస్తా.. – బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్.

42%శాతం రిజర్వేషన్ కోసం మరొకసారి ఆమరణ నిరహార దీక్ష చేస్తా.. – బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్.
IMG-20250615-WA0107

రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే బీసీలను వంచించినట్లే.

కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక వైఖరిని మార్చుకోవాలి.

ముఖ్యమంత్రికి బీసీలపై సవతి తల్లి ప్రేమ తగదు.

ప్రాణాలు అర్పించైన రిజర్వేషన్ సాధిస్తా.

బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజరాబాద్, జూన్ 15: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీల మేరకు 42%శాతం రిజర్వేషన్ లు కల్పించాలని రిజర్వేషన్లు పెంచిన పిదపనే ఎన్నికలు నిర్వహించాలని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. బీసీ మేలు కొలుపు యాత్ర సందర్భంగా జక్కని సంజయ్ మాట్లాడుతూ, జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో మేమెంతో మాకు అంత వాటా సాధన కోసం పోరాటం చేస్తున్నామని, గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 42 %శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తీర్మానం చేసి ఎన్నికల మేనిఫెక్టోలో ప్రకటించారని అధికారంలోకి వచ్చాక ఆ ప్రక్రియ ప్రారంభించకపోతే మేము బీసీ ఉద్యమాలు చేసి ప్రభుత్వం మెడలు వంచి కుల గణన చేయించుకున్నామని, అంతేగాక 42%శాతం రిజర్వేషన్ కోసం విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థల్లో పెంపు కోసం చట్టసభల్లో తీర్మానానికి పోరాడేమని అసెంబ్లీ తీర్మానం అయి ఉన్న బిల్లులను అమలు చేయాల్సిన ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు. బీసీల రిజర్వేషన్ల పెంపు అమలు కోసం కాలయాపన చేస్తున్న ప్రభుత్వం సుప్రీంకోర్టు కేసును సీలింగును సాకుగా చూపెడుతుందని వాస్తవానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడానికి తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకి స్వేచ్ఛ ఉన్నప్పటికీ బీసీలపై కాంగ్రెస్ పార్టీ సవితి తల్లి ప్రేమ చూపెడుతుందని అన్నారు. వెంటనే స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు 42%శాతం రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడానికి పోరాటం చేయాలని జూలై చివరి మాసంలో పార్లమెంట్ ప్రారంభమవుతుందని ఆ సందర్భంలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడానికి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ముందుండి తొమ్మిదొ షెడ్యూల్ లో చేర్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. రాష్ట్రంలోని బీసీ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడానికి తాము గత రెండు నెలల కింద మూడు మాసాలు ఢిల్లీలో ఉండి 22 రోజుల దీక్ష చేసి 12 జాతీయ పార్టీలను ఒప్పించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని దానికి కొనసాగింపుగా మళ్లీ పోరాటానికి సిద్ధంగా ఉండి పోరాటం చేద్దామని కాంగ్రెస్ పార్టీ దానికి సహకరించాలని రేవంత్ రెడ్డి నాయకత్వం వహించాలని తద్వారా బీసీలకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలోప్రాణాలకు తెగించి పోరాటం చేసి అయిన రిజర్వేషన్లు అమలు చేయిస్తా మని గతంలో కాంగ్రెస్ పార్టీ నాన్చుడువేత ధోరణిలో ఉన్నప్పుడు తాము 10 రోజుల ఆమరణ నిరాహారదీక్ష చేసి కుల గణన చేయించామని అదే రకంగా మరొకసారి ఆమరణ నిరహార దీక్ష చేయడానికి వెనుకకు వెనకాడమని, ప్రాణాలకు తెగించైనా ఇర్వేషన్ పెంపు సాధిస్తామని జక్కని సంజయ్ తెలిపారు.

Oplus_16908288
Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!