16-06-2025 NORMAL NEWS 04:35 PM
swarnodayam.com
Telugu Daily News
16-06-2025 04:35 PM By Mandala Yadagiri

క్రీడా పాఠశాల ఎంపిక నిష్పక్షపాతంగా నిర్వహించాలి… – మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్

క్రీడా పాఠశాల ఎంపిక నిష్పక్షపాతంగా నిర్వహించాలి… – మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: క్రీడా పాఠశాల ఎంపిక పోటీలను సజావుగా నిర్వహించి ప్రతిభా ఆధారంగా నిష్పక్షపాతంగా క్రీడాకారులను ఎంపిక చేయాలని ఎంఈఓ భూపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎంఈఓ అధ్యక్షతన మండలంలోని పీడీ మరియు పీఈటీలతో సమావేశం ఏర్పాటు చేశారు. క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు ఈనెల 18న హుజురాబాద్ మండల స్థాయి క్రీడా పాఠశాల ప్రవేశ ఎంపిక పోటీలు గవర్నమెంట్ హై స్కూల్ హుజురాబాద్ ఆవరణలో నిర్వహించనునట్లు మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్ తెలియజేశారు. మండలంలోని నాలుగవ తరగతి చదువుతూ తేదీ 01 సెప్టెంబర్ 2016 నుండి 31 ఆగస్టు 2017 మధ్య జన్మించిన విద్యార్థులు పాల్గొనవచ్చు అని అన్నారు. ఇదివరకే ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు లాగిన్ అయినటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్, నాలుగో తరగతి చదువుతున్నటు వంటి బోనఫైడ్ సర్టిఫికెట్ మరియు ఐదు ఫోటోలు ఆధార్ కార్డు నకలు తీసుకొని రాగలరన్నారు
తేదీ 18 జూన్ 2025 ఉదయం 9 గంటలకి గవర్నమెంట్ హై స్కూల్ క్రీడా మైదానంలో మండల ఎస్జీఎఫ్ కన్వీనర్ చిరుత శ్రీనివాస్ (8096791096)ని కలవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిడీలు పి ప్రవీణ్ కుమార్, చిరుత శ్రీనివాస్, కే రేణుక, డి.సత్యానందం, టీ భాగ్యలక్ష్మి, ఎస్అనిల్ కుమార్ పాల్గొన్నారు.

మండలంలోని పీడీ మరియు పీఈటీలతో సమావేశం నిర్వహిస్తున్న ఎంఈఓ శ్రీనివాస్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!