Social 1080×1350 • Multi-page
16-06-2025 BREAKING NEWS 05:15 PM
swarnodayam.com
Telugu Daily News

బేడ బుడగ జంగాలకు ఇందిరమ్మ ఇంటి పట్టాల పంపిణీ: – కాంగ్రెస్ చొరవతో నెరవేరిన దశాబ్దాల కల. – బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు

బేడ బుడగ జంగాలకు ఇందిరమ్మ ఇంటి పట్టాల పంపిణీ: – కాంగ్రెస్ చొరవతో నెరవేరిన దశాబ్దాల కల. – బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు
IMG-20250616-WA0055

,మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జూన్ 16: హుజూరాబాద్ పట్టణంలోని బేడ బుడగ జంగాల కాలనీలో నివసిస్తున్న సుమారు 15 మంది లబ్ధిదారులకు సోమవారం రోజు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్‌లను కాంగ్రెస్ నేతలు పంపిణీ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. మెరుగైన జీవన పరిస్థితుల కోసం బేడ బుడగ జంగం జన సంఘం ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్‌ను ఇది నెరవేర్చిందనీ, గత మూడు దశాబ్దాలుగా హుజూరాబాద్ పట్టణంలో నివసిస్తున్న బేడ బుడగ జంగాల కాలనీ అభివృద్ధి విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు నిర్లక్ష్యం వహించారని ఆ సంఘం నివేదించింది. అయితే, ఈ సమస్యను హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ప్రణవ్ బాబు దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఆయన వేగంగా స్పందించారన్నారు.
కేవలం మూడు నెలల క్రితం, కాలనీలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సుమారు 30 టిప్పర్ల మొరం పోయించారనీ, అనేక కుటుంబాలు ఇంకా పూరి గుడిసెలలో నివసిస్తున్నారని తెలుసుకున్న ప్రణవ్ బాబు, వెంటనే 15 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించారనీ కాంగ్రెస్ నేతలు తెలిపారు. తమ సమస్యలపై తక్షణమే, సమర్థవంతంగా స్పందించిన ప్రణవ్ బాబుకు బేడ బుడగ జంగం జన సంఘం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ పంపిణీ కార్యక్రమానికి హుజూరాబాద్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేకల తిరుపతి, హుజూరాబాద్ పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు యేముల పుష్పలత, 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్ర నాగరాజు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్ర మంలో బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తూర్పాటి లింగయ్య, రాష్ట్ర నాయకులు వానరాశి జాన్, సమ్మయ్య, రేవెల్లి వెంకటేష్, చింతల అంజి, భూతం అంజి, మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు వానరాశి సమ్మక్క, నాగలక్ష్మి, రజిత, రాజేశ్వరి, కోమల, లక్ష్మి తదితరులు హాజరయ్యారు.

బుడగ జంగాల కాలనీలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నేతలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!