16-06-2025 NORMAL NEWS 07:48 PM
swarnodayam.com
Telugu Daily News
16-06-2025 07:48 PM By Mandala Yadagiri

సిర్సపల్లి రైతు వేదికలో సీఎం వీడియో కాన్ఫరెన్స్ వీక్షించిన రైతులు.

సిర్సపల్లి రైతు వేదికలో సీఎం వీడియో కాన్ఫరెన్స్ వీక్షించిన రైతులు.
IMG-20250616-WA0079

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకుని అధిక దిగుబడులు సాధించాలని హుజూరాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు సునీత అన్నారు. వ్యవసాయ శాఖ అమలు పరుస్తున్న రైతు నేస్తం కార్యక్రమములో భాగంగా మూడవ విడతగా హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామములో గల రైతు వేదికలో రైతులతో నేరుగా శాస్ర్తవేత్తలు, అధికారులు మాట్లాడే వీలుగా వీడియో కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇలా ఏర్పాటు చేసిన రైతు వేదికల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రైతులతో మాట్లాడి సందేశాన్ని ఇచ్చారు. అనంతరం వ్యవసాయ శాఖ రాష్ట్ర అధికారులు మరియు శాస్ర్తవేత్తలు రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమ అనంతరం వ్యవసాయ విస్తరణ అధికారి పొద్దుటురి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు రైతులకు వీడియకాన్ఫరెన్స్ ద్వారా వారి సందేహాలను నివృత్తి చేసుకునేలా రైతు నేస్తం కార్యక్రమం ఉపయోపడుతుందని ఇట్టి అవకాశాన్ని సిర్సపల్లి క్లస్టర్ రైతులు వినియోగించుకోవాలని కోరారు. ప్రతి రైతు మంగళవారము ఒక గంట సమయాన్ని రైతు వేదికలో వెచ్చించి సాంకేతిక పరంగా ముందడుగు వేయాలన్నారు. కార్యక్రమములో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సునీత, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాము హుజురాబాద్ చెర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు సంపత్, మంజుల, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ రవి మరియు రైతులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ను వీక్షిస్తున్న సింగిల్ విండో అధ్యక్షుడు కొండల రెడ్డి ఎంపీడీవో సునీత, ఏఈఓ సతీష్ తదితర రైతులు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!