Social 1080×1350 • Multi-page
16-06-2025 BREAKING NEWS 08:05 PM
swarnodayam.com
Telugu Daily News

రైతు బంధు నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రైతు ప్రజాసంఘాల సమాఖ్య దన్యవాదాలు – పోలాడి రామారావు

రైతు బంధు నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రైతు ప్రజాసంఘాల సమాఖ్య దన్యవాదాలు – పోలాడి రామారావు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఎకరాలతో కట్ ఆఫ్ సంబంధం లేకుండా రైతులు సాగు చేసిన అన్ని ఎకరాలకు ప్రస్తుత ఖరీఫ్ పంటకు ఎకరాకు 6 వేలు చొప్పున సోమవారం రైతు నేస్తం కార్య క్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రైతు బందు నిధులు విడుదల చేయడం పట్ల రైతు ప్రజాసంఘాల సమాఖ్య తరపున దన్యవాదాలు తెలుపుతున్నట్లు రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రకటించారు.
ప్రస్తుత ఖరీఫ్ పంట సాగు ప్రారంభించిన రాష్ట్ర వ్యాప్త అన్నదాతలకు ఈ పంట బెట్టుబడి సహాయం ఎంతో ఉపకరిస్తుందని పోలాడి రామారావు పేర్కొన్నారు. అన్నదాతలకు అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు గతంలో లాగా సబ్సిడీపై సకాలంలో అందజేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!