Social 1080×1350 • Multi-page
16-06-2025 BREAKING NEWS 09:45 PM
swarnodayam.com
Telugu Daily News

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో కాకతీయ విద్యార్థుల ప్రభంజనం!

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో కాకతీయ విద్యార్థుల ప్రభంజనం!
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జూన్ 16: సోమవారం విడుదలైన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు మరోసారి రాష్ట్రస్థాయిలో తమ సత్తా చాటారు. అత్యుత్తమ మార్కులతో ప్రభంజనం సృష్టించి తమ విద్యా సంస్థకు గొప్ప కీర్తిని తెచ్చిపెట్టారు.
ఎంపీసీ (MPC) విభాగంలో అగ్రస్థానం:
ప్రథమ సంవత్సర ఎంపీసీ విభాగంలో కె నీతు 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిగా నిలిచింది. అదేవిధంగా, పి సహస్ర, వి సంజన 467 మార్కులు, గణమి అష్నా, ఎన్ చరితార్ధి, ఎ తనుశ్రీ, పి యశశ్రీ 466 మార్కులు సాధించి తమ ప్రతిభను నిరూపించుకున్నారు.
బీపీసీ (BPC) విభాగంలో మెరుగైన ఫలితాలు:
బీపీసీ విభాగంలో ఎస్ నాగ విశిష్ట 440 మార్కులకు గాను 438 మార్కులతో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అదే క్రమంలో జి వైష్ణవి 437 మార్కులు, ఆర్ శ్లేష 436 మార్కులు, హాజరా సాదత్ 435 మార్కులు సాధించారు.
సీఈసీ (CEC) విభాగంలోనూ సత్తా చాటిన విద్యార్థిని:
సీఈసీ విభాగంలో ఎన్. గోమతి 500 మార్కులకు గాను 494 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిగా నిలిచింది.
ఈ అద్భుత విజయం సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ మారబోయిన వేణుమాధవ్, డైరెక్టర్లు సిహెచ్ రాజేశ్వర్ రెడ్డి, కె తిరుపతిరెడ్డి, కె ప్రవీణ్ రెడ్డి, జె ప్రకాశ్ రెడ్డి మరియు అధ్యాపక బృందం ఘనంగా అభినందించారు. విద్యార్థుల కృషి, పట్టుదలతో పాటు అధ్యాపకుల బోధనా నైపుణ్యం ఈ విజయానికి కారణమని వారు పేర్కొన్నారు.

ఎంపీసీ విభాగంలో కె నీతు 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినినీ పూల బొకే ఇచ్చి అభినందిస్తున్న కళాశాల ప్రిన్సిపల్, డైరెక్టర్లు, అధ్యాపకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!