17-06-2025 NORMAL NEWS 06:07 PM
swarnodayam.com
Telugu Daily News
17-06-2025 06:07 PM By Mandala Yadagiri

చెల్‌పూర్ గ్రామంలో రెవిన్యూ సదస్సు–387 భూ భారతి (ఆర్ ఓఆర్) దరఖాస్తుల స్వీకరణ

చెల్‌పూర్ గ్రామంలో రెవిన్యూ సదస్సు–387 భూ భారతి (ఆర్ ఓఆర్) దరఖాస్తుల స్వీకరణ
IMG-20250617-WA0045

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జూన్ 17: హుజూరాబాద్ మండలంలోని చెల్‌పూర్ గ్రామంలో మంగళవారం రెవిన్యూ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూ భారతి (ఆర్ ఓఆర్)కు సంబంధించి గ్రామస్థుల నుండి మొత్తం 387 అప్లికేషన్లు స్వీకరించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ తహశీల్దార్ కనకయ్య పాల్గొని, రైతులు మరియు గ్రామ ప్రజల సమస్యలు, భూముల రికార్డులపై నేరుగా స్పందించారు. రికార్డుల పరిశీలన, పరిష్కార చర్యలు వేగవంతంగా కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రజలకు మరింత సౌకర్యంగా సేవలందించేందుకు రెవిన్యూ శాఖ తరపున ఇలాంటి సదస్సులను గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని తహశీల్దార్ వెల్లడించారు.

రెవెన్యూ సదస్సులో దరఖాస్తుల స్వీకరిస్తున్న తహసిల్దార్ కనుకయ్య, ఆర్ ఐ శేఖర్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!