Social 1080×1350 • Multi-page
17-06-2025 BREAKING NEWS 06:51 PM
swarnodayam.com
Telugu Daily News

ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులకు ఆన్‌లైన్ లో శిక్షణ

ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులకు ఆన్‌లైన్ లో శిక్షణ
IMG-20250617-WA0068

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ జూన్ 17: భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులకు ఆన్‌లైన్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో బూత్ లెవెల్ ఆఫీసర్ల (BLOs) ఎంపిక ప్రక్రియ, అర్హతలు, బాధ్యతలు, విధులు తదితర అంశాలపై వివరంగా మార్గనిర్దేశం చేశారు. బిఎల్.ఓలుగా పనిచేయనున్న వారికి ఉండాల్సిన అర్హతలు, విధులు, ఓటర్లకు అందించాల్సిన సేవలపై స్పష్టత ఇచ్చారు. అలాగే, బిఎల్.ఓల ఎంపికలో అనుసరించాల్సిన ప్రామాణిక విధానాన్ని వివరించారు.

వచ్చే జూలై 2న జిల్లాల వారీగా బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఈఆర్వోల ఆధ్వర్యంలో ప్రత్యక్ష శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఆన్‌లైన్ శిక్షణను కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో నుంచి వీక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆన్‌లైన్ శిక్షణను కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వీక్షిస్తున్న అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!