Social 1080×1350 • Multi-page
17-06-2025 BREAKING NEWS 08:11 PM
swarnodayam.com
Telugu Daily News

కొత్తగా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అశ్విని తానాజీ వాకడె

కొత్తగా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అశ్విని తానాజీ వాకడె
IMG-20250617-WA0103

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ జూన్ 17: కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా డాక్టర్ అశ్విని తానాజీ వాకడె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, ఆర్డీవో కార్యాలయ అధికారి సుధాకర్ ఆమెకు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అడిషనల్ కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే..

కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అశ్విని తానాజీ వాకడే హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.

అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న అశ్విని తానాజీ వాకడే

మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన అదనపు కలెక్టర్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!