Social 1080×1350 • Multi-page
17-06-2025 BREAKING NEWS 09:46 PM
swarnodayam.com
Telugu Daily News

కరీంనగర్ జడ్పీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు అధికారులు.. – కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ

కరీంనగర్ జడ్పీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు అధికారులు.. – కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ జూన్ 17: కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు లంచగొండి అధికారుల భరతం పట్టారు. వాహన బిల్లుల చెల్లింపుకు సంబంధించి రూ.8వేల లంచం తీసుకుంటున్న ముగ్గురు అధికారులపై ఏసీబీ అధికారులు దాడి నిర్వహించి ఇద్దరిని పట్టుకున్నారు. ఏసీబీ ఏసీబీ రమణమూర్తి సమాచారం మేరకు, అసిస్టెంట్ ఇంజినియర్ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ లు రూ.8,000 లంచం తీసుకుంటుండగా అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలతో ప్రభుత్వ శాఖల్లో లంచా అవతారూలపై ప్రజలు తిరుగుబాటు మొదలైనట్లుగా పలువురు భావిస్తున్నారు. ప్రజల్లో చైతన్యము కలిగి తిరుగుబాటు భావనలు పెరిగిపోవడం కొంత శుభ పరిణామంగా సామాజికవేత్తలు భావిస్తున్నారు.

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన కరీంనగర్ జడ్పీ ఉద్యోగులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!