Social 1080×1350 • Multi-page
19-06-2025 BREAKING NEWS 02:04 PM
swarnodayam.com
Telugu Daily News

రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీ.. – హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్.. – హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు

రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీ.. – హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్..  – హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు
IMG-20250619-WA0079

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ఏఐసీసీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత్ జోడో న్యాయ్ యాత్ర ద్వారా అందరికీ చేరువై అన్ని వర్గాల సమస్యలను తెలుసుకొని తెలంగాణలో కులగణన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేశారని అన్నారు. రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ పట్టణ, మండల అధ్యక్షులు,మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, యువజన విభాగం, మహిళా అధ్యక్షురాలు, యువజన కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సేవాదళ్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

బర్త్ డే కేక్ కట్ చేయగా ప్రణవ్ బాబుకు కేక్ తినిపిస్తున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!