Social 1080×1350 • Multi-page
19-06-2025 BREAKING NEWS 09:38 PM
swarnodayam.com
Telugu Daily News

కమలాపూర్ కాసింపల్లిలో, హుజురాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేసిన ప్రణవ్..

కమలాపూర్ కాసింపల్లిలో, హుజురాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేసిన ప్రణవ్..
IMG-20250619-WA0114

– కాసింపల్లిలో కళ నెరవేరిన వేల లబ్ధిదారుల్లో ఆనందం.

– దేశరాజ్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలన..

– పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (కమలాపూర్): దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఇళ్లకు ముగ్గు పోసి ఇళ్ల పట్టాలు అందజేస్తుండడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తుంది. హుజురాబాద్ పట్టణంలోని 15, 17 వ వార్డుల్లో, కమలాపూర్ మండల కేంద్రంలోనీ కాసింపల్లిలో తొమ్మిది మంది లబ్దిదారులకు ముగ్గు పోసి, కొబ్బరి కాయ కొట్టి, ఇళ్ల పట్టాలను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఎలక్షన్ క్యాంపెనింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు గుడిసెల్లో నివసిస్తున్న వారిని చూసానని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పామని, ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతలో ఇళ్లు మంజూరు చేశామని మరో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేపిస్తామని తెలిపారు. మండలానికి కూత వేటు దూరంలో ఉన్న అప్పుడు మంత్రిగా, ఎమ్మెల్సీగా ఉండి ఎవరు ఏం చేయలేకపోయారని, కనీసం ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వలేదని, ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లు ఇస్తున్నామని అన్నారు. అనంతరం ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న దేశరాజ్ పల్లి గ్రామంలోని 150 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణం ఎలా జరుగుతుంది, డబ్బులు సకాలంలో పడుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ ఝాన్సీ, డైరెక్టర్లు, కమలాపూర్, హుజురాబాద్ మండల నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిక..

కమలాపూర్ మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు పార్టీ కండువా కప్పి పార్టిలోకి ఆహ్వానించారు ప్రణవ్. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు చూసి, ప్రణవ్ నాయకత్వాన్ని బపరుస్తామని తెలిపారు.

హుజురాబాద్ పట్టణంలోని 15, 17 వ వార్డులో అధికారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందజేస్తున్న ప్రణవ్..

ముగ్గు పోసి కొబ్బరికాయ కొడుతున్న ప్రణవ్..

కమలాపూర్ కాసింపల్లిలో ఇందిరమ్మ పట్టాలను అందజేస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్

ప్రణవ్ బాబును ఆప్యాయంగా పలకరిస్తున్న వృద్ధురాలు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!