23-06-2025 NORMAL NEWS 02:06 PM
swarnodayam.com
Telugu Daily News
23-06-2025 02:06 PM By Mandala Yadagiri

సిఏంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా పేదలకు లబ్ది.. – కాంగ్రెస్ నేత ప్రణవ్..

సిఏంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా పేదలకు లబ్ది.. – కాంగ్రెస్ నేత ప్రణవ్..
IMG_20250623_140342

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఆపదలో ఉన్న పేదలకు లబ్ధి చేకూరుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం రోజున హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలు, రెండు పట్టణాలకు సంబంధించిన 198 మంది లబ్ధిదారులకు 75,67,000/- లక్షల విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. చెక్కులు అందజేసిన వారిలో హుజూరాబాద్ మండలం-31, హుజురాబాద్ పట్టణం-18, జమ్మికుంట మండలం-22, జమ్మికుంట పట్టణం-13, వీణవంక- 39, ఇల్లందకుంట- 21, కమలాపూర్- 54 మంది చొప్పున చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతిగా వ్యవహరిస్తూ ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ తో అన్ని విధాల ఆదుకోవడం జరుగుతుందని ప్రణవ్ తెలిపారు.

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!