24-06-2025 NORMAL NEWS 08:34 PM
swarnodayam.com
Telugu Daily News
24-06-2025 08:34 PM By Mandala Yadagiri

హుజురాబాద్ లో కాంగ్రెస్ సంబరాలు

హుజురాబాద్ లో కాంగ్రెస్ సంబరాలు
IMG_20250624_203147

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. రైతు భరోసా సంబురాలలో భాగంగా నాయకుల చిత్ర పటానికి పాలాభిషేకం, బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…రైతు భరోసాను 9 రోజుల్లో 9వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం గొప్ప విషయం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటైన రైతు భరోసా పథకంతో రైతులకి నేరుగా వారి అకౌంట్లో 12 వేల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. ఈ పథకం 16వ తేదీన నిధుల విడుదల ప్రారంభించి ఈరోజుకి 100 శాతం వ్యవసాయ భూములకు రైతు భరోసా నిధుల విడుదల పూర్తి చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి, ఇప్పటి వరకు 1 కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. కాంగ్రెస్ రైతులకు రైతుల పక్షపాతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!