Social 1080×1350 • Multi-page
25-06-2025 BREAKING NEWS 07:28 PM
swarnodayam.com
Telugu Daily News

రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ…రైతు భరోసాతో రైతుల పండుగ. – హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత.

రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ…రైతు భరోసాతో రైతుల పండుగ. – హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత.
IMG-20250625-WA0109

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతి అని మరోసారి రుజువు చేసుకుందనీ హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత పేర్కొన్నారు. గతంలో చూసినట్లయితే వరి వేస్తేనే ఉరి అనే విధంగా ఉండేదనీ కానీ ఈరోజు దండగ కాదు పండగ అని రైతు కళ్ళల్లో ఆనందం నింపిన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇచ్చిన హామీల ప్రకారం సంవత్సరానికి ఎకరానికి రూ. 12,000 చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందజేయనున్నారనీ, రైతు భరోసా ఈరోజు వరకు తొమ్మిది రోజుల్లో రూ. 9000 కోట్ల రైతు భరోసాలో భాగంగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. రైతులు ఎంతో సంతోషంగా పండగ వాతావరణం చేసుకోవడం, రైతుల కళ్ళల్లో ఆనందం నింపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పుష్పలతో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఒక కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారనీ ఆమె చెప్పారు. గతంలో చూసినట్లయితే ఎన్నడూ రైతు భరోసా వేసిన దాఖలాలు లేవు అని, ఇటువంటి పండుగ వాతావరణాన్ని ఏర్పర్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కి, పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణకి మరియు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ కి పుష్పలత ప్రత్యేక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలిపారు.

రైతు భరోసా చెల్లించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న పట్టణ మహిళా శాఖ అధ్యక్షురాలు యేముల పుష్పలత

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!