Social 1080×1350 • Multi-page
25-06-2025 BREAKING NEWS 11:09 PM
swarnodayam.com
Telugu Daily News

విద్యా వ్యవస్థలో దోపిడిని అరికట్టాలని ఎంఈఓకి వినతి

విద్యా వ్యవస్థలో దోపిడిని అరికట్టాలని ఎంఈఓకి వినతి
IMG-20250625-WA0111

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విద్య వ్యవస్థలో దోపిడిని అరికట్టాలని హుజురాబాద్ ఎంఈఓ భూపతి శ్రీనివాస్ కి ఆజాద్ ఫెడరేషన్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంజాల రేవంత్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన ప్రతి ప్రైవేటు కళాశాలలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని మండలాలకు రెగ్యులర్ ఎంఈఓ లను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు నియంత్రణ కమిటీలను అమలు చేయాలన్నారు. కార్పొరేట్ సంస్థలలో పేద విద్యార్థులకు 25 శాతం కోటాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్, శివ, కుమార్,అరవింద్, అవినాష్, తిరుపతి తోపాటు తదితరులు పాల్గొన్నారు.

ఎంఈఓ శ్రీనివాస్ వినతిపత్రం అందజేస్తున్న ఆజాద్ ఫెడరేషన్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంజాల రేవంత్, నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!