26-06-2025 NORMAL NEWS 07:11 PM
swarnodayam.com
Telugu Daily News
26-06-2025 07:11 PM By Mandala Yadagiri

డయేరియా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. – మండల వైద్యాధికారి డాక్టర్ మధుకర్.

డయేరియా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. – మండల వైద్యాధికారి డాక్టర్ మధుకర్.
IMG-20250626-WA0098

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సీజనల్ వ్యాధులలో భాగంగా వర్షాకాలంలో వచ్చే డయేరియా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనీ చేల్పూర్ పీహెచ్సీ మండల వైద్యాధికారి డాక్టర్ మధుకర్ పేర్కొన్నారు. డయేరియా వ్యాధి నివారణ, నిరోధక చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశ్యంతో హుజురాబాద్ ఎంపిడిఓ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండల వైద్యాధికారి డాక్టర్ మధు మాట్లాడుతూ…డయేరియా వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారించాలంటే శుభ్రమైన నీటి వినియోగం ఎంతో కీలకమని, అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం అవసరమని సూచించారు. ఈ సందర్భంగా డయేరియా వ్యాధి సంబంధిత అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ మధు, డాక్టర్ జరీనా, ఎంపిడిఓ సునీత, ఎంఈఓ శ్రీనివాస్, ఎంపీవో, కార్యాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జడ్పీహెచ్ ఎస్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన..

హుజురాబాద్ పట్టణంలోని జడ్పిహెచ్ఎస్ బాలుర పాఠశాలలో సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డయేరియా, డెంగ్యూ చికెన్ గునియా వ్యాధులు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి వాటిని రాకుండా నివారించేందుకు ముందస్తు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానిపై మండల వైద్యాధికారి డాక్టర్ మధు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి తాసిల్దార్ కనుకయ్య హాజరై విద్యార్థులకు వ్యాధుల దరిచేరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డాక్టర్ జరిగిన, ఎంపీఈవో సంజీవరెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారి మధుకర్, ఇతర అధికారులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!