Social 1080×1350 • Multi-page
26-06-2025 BREAKING NEWS 07:36 PM
swarnodayam.com
Telugu Daily News

ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన వ్యవసాయ అధికారులు

ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన వ్యవసాయ అధికారులు
IMG_20250626_193533

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలములో సిర్సపల్లి, ధర్మరాజుపల్లి, కందుగుల మరియు చెల్పూర్ గ్రామాల్లో ఫర్టిలైజర్ షాపులను హుజురాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు సునీత తనిఖీ చేశారు. ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులతో వానాకాలము సీజన్ కి సంబంధించి ఎరువుల విత్తనాల పురుగు మందుల నిల్వలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. అందరు డీలర్లు కాలం చెల్లిన విత్తనాలు మరియు కాలం చెల్లిన పురుగు మందులు, నిషేధిత పురుగు మందులు అమ్మకూడదని అన్నారు. అలాగే తమ రికార్డులు ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహిస్తూ స్టాక్ రిజిస్టర్లను రోజు వారిగా రాయాలని సూచించారు. పిఓఎస్ (PoS) మిషిన్ ద్వారానే ఎరువుల అమ్మకాలు చేయాలని, భౌతికనిల్వలు పిఓఎస్ మిషిన్ లోని నిలువలతో తప్పక సరిచూసుకోవాలని సూచించినారు. షాపు యొక్క మెయిన్ బోర్డు పైన డోర్ నెంబర్ మరియు లైసెన్స్ యొక్క వివరాలు తప్పక పొందుపరచాలన్నారు. అధీకృత లైసెన్సులు లేకుండా వ్యాపారం చేయకూడదని మరియు రెన్యువల్ చేయించుకొనుటకు తగినంత ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విత్తన ఎరువులు క్రిమిసంహారక మందులకు స్టాక్ బోర్డులు విడివిడిగా ఏర్పాటు చేసి ప్రదర్శించాలన్నారు. విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులను విడివిడిగా పొందుపరచుకోవాలన్నారు. ప్రతిరోజు స్టాక్ బోర్డ్ ను ఏ రోజుకారోజు క్రయవిక్రయాలను బట్టి సరి చేసుకోవాలని తెలిపారు. విత్తనాలు విక్రయించేటప్పుడు రైతుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధరలు MRP కి మించి అమ్మరాదని, అమ్మితే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల వ్యవసాయ అధికారి చాడ భూమిరెడ్డి, ఇతరులు పాల్గొన్నారు.

సిర్సపల్లిలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేస్తున్న ఏడిఏ సునీత

చేల్పూర్ లో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేస్తున్న ఏడిఏ సునీత

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!