26-06-2025 NORMAL NEWS 09:45 PM
swarnodayam.com
Telugu Daily News
26-06-2025 09:45 PM By Mandala Yadagiri

పాఠశాల ఆవరణలో పాఠ్యపుస్తకాలు విక్రయిస్తే భౌతిక దాడులకీ దిగుతం.. – హుజురాబాద్ పట్టణ కేంద్రంలో విద్యార్థి యువజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం.

పాఠశాల ఆవరణలో పాఠ్యపుస్తకాలు విక్రయిస్తే భౌతిక దాడులకీ దిగుతం.. – హుజురాబాద్ పట్టణ కేంద్రంలో విద్యార్థి యువజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం.
IMG-20250626-WA0130

ఫీజు నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలి

ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ముకాస్తున్న విద్యా శాఖ అధికారులు

విద్యార్థి యువజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రైవేట్ పాఠశాల ఆవరణలో పాఠ్యపుస్తకాలు విక్రయిస్తే భౌతిక దాడులకీ దిగుతం అని హుజురాబాద్ పట్టణ కేంద్రంలో విద్యార్థి యువజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించినట్లు వారు గురువారం తెలిపారు. హుజురాబాద్ పట్టణ కేంద్రంలో విద్యార్థి యువజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం
నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యను వ్యాపారం చేస్తూ పాఠశాలల ఆవరణలో అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా వసూలు చేస్తుంటే విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ముకాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల ఆవరణలో పాఠ్యపుస్తకాలు విక్రయిస్తే భౌతిక దాడులకు కూడా వెనుకాడబొమని హెచ్చరించారు. ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలు మితిమీరుతున్నాయని పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల యాజమాన్యం మరియు విద్యాశాఖ అధికారులు తీరు మార్చుకోకపోతే అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు టేకుల శ్రావణ్, కొలుగూరి సూర్యకిరణ్, పర్లపల్లి నాగరాజు, కర్రే శ్రీధర్ రెడ్డి, పంజాల రేవంత్, గండు ప్రశాంత్ యాదవ్, ఆలేటి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థి యువజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం దృశ్యం.
Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!