27-06-2025 NORMAL NEWS 07:43 PM
swarnodayam.com
Telugu Daily News
27-06-2025 07:43 PM By Mandala Yadagiri

మత్తు పదార్థాలతో ఆరోగ్యం, జీవితం నాశనం. – డాక్టర్ కూరపాటి రమేష్

మత్తు పదార్థాలతో ఆరోగ్యం, జీవితం నాశనం.  – డాక్టర్ కూరపాటి రమేష్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
నేటి యువత ప్రతినిధిర్థాలకు వ్యసనాలకు దూరంగా ఉండాలని మత్తుకు బానిసైతే ఆరోగ్యంతో పాటు జీవితం కూడా నాశనం అవుతుందని డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు. కూరపాటి హాస్పిటల్, హుజురాబాద్, జమ్మికుంట ఐఎంఏ ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మత్తుపదార్ధాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జీవితాలను నాశనం చేసే మత్తు పదార్థాలకు యువత బానిస కారాదని వాటికి దూరంగా ఉండాలని అన్నారు. మత్తు పదార్థాలవాడకాన్ని వ్యతిరేకంగా మనం అందరం ఒకవైపు నిలబడాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సుధాకర్, డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ రామలింగారెడ్డి, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ సురేష్, కూరపాటి హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న డాక్టర్ కూరపాటి రమేష్, హుజురాబాద్, జమ్మికుంట ఐఎంఏ ల నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!