Social 1080×1350 • Multi-page
28-06-2025 BREAKING NEWS 02:40 PM
swarnodayam.com
Telugu Daily News

పీవీ సేవా సమితి, అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పీవీ జయంతి వేడుకలు

పీవీ సేవా సమితి, అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పీవీ జయంతి వేడుకలు
IMG-20250628-WA0058

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారత రత్న, మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు 104వ జయంతిని శనివారం పట్టణంలోని సైదాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఘనంగా నిర్వహించారు. పీవీ సేవా సమితి, అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ సేవా సమితి అధ్యక్షుడు తూము వెంకటరెడ్డి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, న్యాయవాది ముక్కెర రాజు, ఐఎంఏ డాక్టర్ రామలింగరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తోట రాజేంద్ర ప్రసాద్, మాట్లాడుతూ…‘‘దేశాభివృద్ధిలో పీవీ నరసింహారావు పాత్ర ఎనలేనిది. ప్రపంచం గర్వించే మేధావి మన ప్రాంత వాస్తవ్యుడిగా ఉండడం గర్వకారణం. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న అందించడం హర్షదాయకం” అని తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు హుజురాబాద్‌లో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు బి మనోజ్, డాక్టర్లు తోగరు విద్యాసాగర్, ప్రదీప్ రావు, ఏఎస్ఐ బండ సంపత్ రెడ్డి, న్యాయవాది శ్రీనివాస్, పల్కల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, మురికి గౌరీశంకర్, రావుల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288

పివి చిత్రపటానికి పూలమాల వేసే నివాళులర్పిస్తున్న నేతలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!