28-06-2025 NORMAL NEWS 04:47 PM
swarnodayam.com
Telugu Daily News
28-06-2025 04:47 PM By Mandala Yadagiri

తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్ స్వేచ్ఛ వొటార్కర్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.

తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్ స్వేచ్ఛ వొటార్కర్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.
FB_IMG_1751108975537

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్ స్వేచ్ఛ వొటార్కర్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక స్పృహ ఉన్న కవయిత్రిగా, జర్నలిస్టుగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవిలు చురుకుగా పాల్గొన్నారని.. బిడ్డను కోల్పోయి శోకతప్త హృదయులైన వారికి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

జర్నలిస్ట్ స్వేచ్ఛ వొటార్కర్ (ఫైల్)

జర్నలిస్ట్ స్వేచ్ఛకు TUWJ H143 కరీంనగర్ జిల్లా శాఖ సంతాపం :

జర్నలిస్ట్ స్వేచ్ఛ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జర్నలిస్టుగా, కవిగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న స్వేచ్ఛ అద్దాంతరంగా జీవితాన్ని ముగించుకోవడం బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా TJF, TUWJ తో కలిసి పని చేసింది. మహిళా జర్నలిస్టులను, మహిళా యాంకర్లను సంఘటితం చేసి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించింది. స్వేచ్చకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు పక్షాన ఘన నివాళి అర్పిస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము అని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( TUWJ H 143 ) కరీంనగర్ జిల్లా నేతలు ఒక ప్రకటనలో తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!