Social 1080×1350 • Multi-page
28-06-2025 BREAKING NEWS 05:41 PM
swarnodayam.com
Telugu Daily News

నిషేధిత మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

నిషేధిత మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రోజున ప్రిన్సిపాల్ వి.ఆంజనేయరావు ముఖ్య అతిథిగా పిబి కిరణ్ కుమార్ సీనియర్ సివిల్ జడ్జి హుజురాబాద్ ని,అతిధులుగా వై అరుణ్ కుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, వై రమేష్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిలను ఆహ్వానించి, విద్యార్థిని విద్యార్థులకు నిషేధిత మత్తు పదార్థాల పట్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిబి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థుల వయస్సు అన్నింటికి ఆకర్షితులై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, యువత మీరు ఎంతో భవిష్యత్ ఉన్నవారు కావున మంచి విద్యను అభ్యసించి మీ తల్లి తండ్రులకు, దేశానికి ఉపయోగపడాలని సూచించారు. వై అరుణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే ద్విచక్రవాహనాలు నడుపరాదు, అతివేగంతో ప్రయాణాలు చేసి ప్రమాదాలకు గురికావద్దు, ప్రతీ ఒక్కరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ,గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా, తోటి వారికి సహాయపడుతూ..సమాజ సేవలో భాగస్వాములు కావాలని చెప్పారు.కళాశాల ప్రిన్సిపాల్ వి.ఆంజనేయరావు మాట్లాడుతూ చిన్న వయస్సులో ఉన్న మీకు ఎంతో భవిష్యత్ ఉంది కావున,క్రమం తప్పకుండా కళాశాలకు వచ్చి,దురలవాట్లకు దూరంగా ఉండి మీ తల్లిదండ్రులకు,కళాశాలకు మంచి పేరు తేవాలని భవిష్యత్ ఉన్నత చదువుల గురించి ఆలోచనాత్మక సందేశాన్ని విద్యార్థులకు ఇచ్చారు.ఇట్టి కార్యక్రమం లో కళాశాల సీనియర్ అధ్యాపకులు తులసీ దాసు,విజేందర్ రెడ్డి,బండి.రాజశేఖర్,ప్రసాద్,సుహాసిని మేడం,విద్యార్థిని విద్యార్థులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!