28-06-2025 NORMAL NEWS 07:59 PM
swarnodayam.com
Telugu Daily News
28-06-2025 07:59 PM By Mandala Yadagiri

పరిశుభ్రత వల్ల బహుళ ప్రయోజనాలు.. ప్రతి ఒక్కరు పరిసరాలు పరిశుభ్రత పాటించాలి. – మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య.

పరిశుభ్రత వల్ల బహుళ ప్రయోజనాలు.. ప్రతి ఒక్కరు పరిసరాలు పరిశుభ్రత పాటించాలి. – మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య.
IMG-20250628-WA0125

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రేపటి పౌరులైన విద్యార్థులు బాల్యం నుండే పరిశుభ్రత పట్ల అవగాహన ఉండాలని దాంతో బహుళ ప్రయోజనాలు కలుగుతాయని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య అన్నారు. శనివారం హుజురాబాద్ పట్టణంలో 27వ వార్డులో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం జరిగింది. వార్డులోని పలు ప్రాంతాల్లో చెత్తాచెదారాన్ని తొలగించారు. అనంతరం న్యూ శాతవాహన హైస్కూల్లో విద్యార్థులకు స్వచ్ఛ హుజురాబాద్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ…హుజురాబాద్ పరిశుభ్రత కోసం కార్మికులకు ప్రజలు సహకరించాలని అన్నారు. బాల్యం నుండే పరిశుభ్రత పట్ల పిల్లలకు అవగాహన ఉండాలని అన్నారు. అనంతరం ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ…. పరిశుభ్రత అందరూ బాధ్యతగా అలవర్చుకోవాలన్నారు. ఆరోగ్యం గా ఉండాలన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వకులాభరణం వెంకటేశ్వర్లు, పరాంకుశం కిరణ్ కుమార్, మేనేజర్ భూపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య..పరిశుభ్రత పట్ల పిల్లలకు అవగాహన పోటీలో విజేతలైనా విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేస్తున్న కమిషనర్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!