28-06-2025 NORMAL NEWS 11:26 PM
swarnodayam.com
Telugu Daily News
28-06-2025 11:26 PM By Mandala Yadagiri

పి.వి.నరసింహారావు ప్రధానిగా ప్రవేశపెట్టిన అర్థిక సంస్కరణలు వల్ల ప్రపంచదేశాలలో భారత్ సుస్థిర స్థానాన్ని పొందింది.. – భీమదేవరపల్లి యంఅర్ఓ రాజేశ్

పి.వి.నరసింహారావు ప్రధానిగా ప్రవేశపెట్టిన అర్థిక సంస్కరణలు వల్ల ప్రపంచదేశాలలో భారత్ సుస్థిర స్థానాన్ని పొందింది.. – భీమదేవరపల్లి యంఅర్ఓ రాజేశ్
IMG_20250628_232303

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (భీమదేవరపల్లి- వంగర) జూన్ 28: మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ పి.వి.నరసింహారావు ప్రధానిగా ప్రవేశపెట్టిన అర్థిక సంస్కరణలు వల్ల ప్రపంచదేశాలలో భారత్ సుస్థిర స్థానాన్ని పొందిందని భీమదేవరపల్లి యంఅర్ఓ రాజేశ్ తెలిపారు.
పి.వి.స్వస్థలం వంగర గ్రామంలో పి.వి.ప్రభాకర్ రావు సౌజన్యంతో పి.వి‌ మ్యూజియం ప్రాంగణంలో నిర్వహించిన స్వర్గీయ పి.వి.104వ జయంతి కార్యక్రమంలో ‌ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పి.వి.పాలన అనంతరం కొనసాగుతున్న
ప్రభత్వాలు ఆయన చూపిన బాటను అనుసరిస్తూ ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. సాప్టవేర్ రంగం పి.వి.చొరవే, తాను జమ్మికుంట వాసిగా విద్యార్థి దశలో పి.వి.గురించి విన్నానని ఒక అధికారిగా ఆయన జయంతి కార్యక్రమంలో పాల్గొనడం ఒక వరంగా భావిస్తున్నాని తెలిపారు.
నేటి తరం యవత ప్రజలు పి.వి‌.జీవిత పాటాన్ని జీవన యానంలో ఒక భాగంగా స్వీకరించాలని రాజేశ్ కోరారు.
అతిథి ప్రముఖులు పి.వి‌.సోదరుని కుమారుడు పి.వి.మదన్ మోహన్ రాష్ట్ర ప్రభుత్వం పి.వి.జయంతి, వర్థంతి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా వంగరతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు అందించాలని ముఖ్యమంత్రి ‌రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీని వల‌ సూర్యచంద్రులు వున్నంతవరకు ఆయనను కీర్తించే అవకాశం వుంటుందని తెలిపారు. పి.వి‌.కుటుంబానికి చెందిన వ్యక్తిగా బాల్య జీవితంలో పి.వి‌ నడచిన తీరు, దేశంకోసం అయన పడే తపన‌ గ్రామాల అభివృద్ధి కొరకు అలోచన చేసే తత్వ గమనించే వాడినని తెలిపారు. ఆయన ఒక‌ ప్రయోగ శాల రైతాంగం కేవలం వ్యవసాయాధారిత పంటలపై ఆధారపడొద్దని యితర పంటలపై ఆసక్తి చూపే విధంగా వంగరలో పాడి పరిశ్రమ, చెరకు, పత్తి, కోళ్ల పరిశ్రమ తానే చేపట్టి మార్గదర్శకులుగా వున్న మహోన్నతమైన వ్యక్తి పి.వి.అని కొనియాడారు. రాష్ట్ర మంత్రిగా ఆశ్రమ పాఠశాలలు, ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు,కేంద్ర మంత్రిగా నవోదయ పాఠశాలలు, ప్రధానమంత్రి గా ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశ దశ దిశ మార్చారని తెలిపారు.
అంతకుముందు పి.వి‌.నగర్ కూడలిలో‌ గల కాంస్య విగ్రహానికి, పి‌వి.మ్యూజియం ప్రాంగణంలో వున్న విగ్రహానికి పలువురు పూలమాలలు సమర్పించి ఘన నివాళర్పించారు.
కాంగ్రెసు నాయకుడు శ్రీరమోజు మొండయ్య అద్యక్షతన జరిగిన సమావేశంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు లింగమూర్తి, రవీందర్, మండల కాంగ్రెస్ అద్యక్షులు అయిలయ్య ,ఊసకోయ ప్రకాశ్, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఒల్లాల రమేశ్, సతీష్ రెడ్డి, గజ్జెల రమేశ్, తిరుపతి రెడ్డి, చంద్రారెడ్డి, మారెం సతీష్ మల్లారెడ్డి, అమల, లచ్చవ్వ, సంధ్య బుచ్చిరెడ్డి, మ్యూజియం ఇన్చార్జ్ లక్ష్మీకాంతరావు, బియర్యస్ నాయకులు కండె సుధాకర్, ఎ.గోపాల్ రెడ్డి, మారెం సతీష్, సీను, ప్రభుతులు పాల్గొన్నారు.

పి.వి‌.నగర్ కూడలిలో‌ గల కాంస్య విగ్రహానికి, పి‌వి.మ్యూజియం ప్రాంగణంలో వున్న విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళర్పింస్తున్న నేతలు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!