Social 1080×1350 • Multi-page
29-06-2025 BREAKING NEWS 09:50 PM
swarnodayam.com
Telugu Daily News

సభ్యుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం- రజక సంఘం.. – మడేలేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి, రజక వృత్తి ధరల పెంపుదలకు తీర్మానం.

సభ్యుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం- రజక సంఘం.. – మడేలేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి, రజక వృత్తి ధరల పెంపుదలకు తీర్మానం.
IMG-20250629-WA0035

– ఆలయ నిర్మాణానికి విరాళాలిచ్చిన దాతలు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్,జూన్29: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ రజక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మారుతి నగర్ లో ఆదివారం రజక సంఘం ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజక వృత్తి ధరల పెంపుదలకు, మడేలేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సంఘం ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. అలాగే, ఆలయ నిర్మాణానికి దాతలు విరాళాలు అందించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొలిపాక శ్రీనివాస్ రూ. 50,000, మాజీ కౌన్సిలర్ నల్ల సుమన్ రూ. 20116, కొండపాక శ్రీనివాస్ రూ. 15000, సభ్యులు నల్ల బాలరాజ్, కొల్లిపాక శంకర్, కొలిపాక సారయ్య, నల్ల సదయ్య రూ. 10,000లతో పాటు దాతలు విరాళాలు అందించారు. ఈ సందర్భంగా సంఘం బాధ్యులు మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కులవృత్తుల ధరలు పెంచడం ద్వారా ఆర్థికంగా చేయూత లభిస్తుందన్నారు. సంఘ సభ్యులు కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించుకుందామని అన్నారు. అలాగే సంఘంలోని ప్రతి ఒక్కరికి సంఘం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం బాధ్యులు కొలిపాక సారయ్య, కొండపాక శ్రీనివాస్ నల్ల బాలరాజు గోపు వెంకటేశ్వర్లు కొలిపాక శ్రీనివాస్, కొలిపాక శంకరయ్య, రజక మహిళా సంఘం బాధ్యులు కొండపాక లక్ష్మి, నిమ్మటూరి రమ, కొలిపాక రాజేశ్వరి, గోపు శాంత కుమారిలతో పాటు సంఘ సభ్యులు, కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొలిపాక శ్రీనివాస్
హాజరైన రజకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!