Social 1080×1350 • Multi-page
29-06-2025 BREAKING NEWS 11:18 PM
swarnodayam.com
Telugu Daily News

అందరికీ ఇచ్చారు అవకాశం.. బీజేపీకి ఇవ్వండి అధికారం.. – రైతును రారాజు చేయడమే మోదీ సర్కార్ లక్ష్యం..- ఇందూరు రైతు మహాసమ్మేళన సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు

అందరికీ ఇచ్చారు అవకాశం.. బీజేపీకి ఇవ్వండి అధికారం.. – రైతును రారాజు చేయడమే మోదీ సర్కార్ లక్ష్యం..- ఇందూరు రైతు మహాసమ్మేళన సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు
IMG_20250629_231613

– పసుపు బోర్డు సాధించుకున్న ఇందూర్ రైతులు హీరోలు

ధర్మపురి అరవింద్ పసుపు అరవింద్ అయ్యారు

– రైతు మహాసమ్మేళన సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు

– స్పందనను ఆస్వాదిస్తూ సంజయ్ ప్రసంగాన్ని విన్న అమిత్ షా

– బండి సంజయ్ పేరు ప్రస్తావించగానే చప్పట్లతో దద్దరిల్లిన సభ

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ‘‘తెలంగాణ ప్రజలారా…. మీరు అందరికీ ఇచ్చారు అవకాశం. ఈసారి బీజేపీకి ఇవ్వండి అధికారం’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు. నిజామాబాద్ లో ఈరోజు పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన రైతు మహా సమ్మేళన సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అద్యక్షులు జి.కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ కుమార్ లేచి మాట్లాడేందుకు సిద్ధమవ్వగానే చప్పట్లతో సభ దద్దరిల్లింది. ప్రజా స్పందనను చూసిన అమిత్ షా నవ్వుతూ బండి సంజయ్ ప్రసంగాన్ని ఆలకించారు. బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

నిజామాబాద్ జిల్లా వాళ్లు గొప్పోళ్లు. మీరు కొట్లాడి సాధించుకున్నరు. మీరంతా లేచి అమిత్ షాకు ధన్యవాదాలు తెలపాలని కోరుతూ చప్పట్లు కొట్టండి(అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు). ఇందరూ రైతులు హీరోలు. మీరు చేసిన ఉద్యమాలు మామూలు కాదు. అరవింద్ ను అంతా పసుపు అరవింద్ అంటున్నారు.

మాది రైతు ప్రభుత్వం. రైతును రాజును చేయాలనేది గత నినాదం.. కానీ రైతును రారాజు, మహారాజు చేయాలనేది మోదీ సర్కార్ నినాదం. తెలంగాణ ప్రజలారా… మీ అందరినీ ఒకటే కోరుతున్నా… అందరికీ ఇచ్చారు అవకాశం… బీజేపీకి ఇవ్వండి అధికారం.

మాట్లాడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

సమావేశానికి హాజరైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బండి సంజయ్ ఎంపిలు అరవింద్, ఈటెల తదితరులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!