Social 1080×1350 • Multi-page
01-07-2025 BREAKING NEWS 03:33 PM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ ఏర్పాటు… – నేర్నాల కిషోర్ నియామకం పట్ల నగారే బృందం హర్షం

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ ఏర్పాటు… – నేర్నాల కిషోర్ నియామకం పట్ల నగారే బృందం హర్షం
IMG-20250701-WA0105

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ ఏర్పాటైంది. ఎమ్మెల్సీ ఎం.కోదండరాం(M Kodandaram)ను చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ప్రకటించింది. సంచాలకులుగా ఉన్న డా. మామిడి హరికృష్ణ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. తెలంగాణ సాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న పలువురిని సభ్యులుగా నియమించింది ప్రభుత్వం. కమిటీ సభ్యులుగా సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గుమ్మడి వెన్నెల, సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు డా. అలేఖ్య పుంజాల, సినీ గీత రచయిత డా. సుద్దాల అశోక్ తేజ, కవి దర్శకుడు బి.నర్సింగరావు, కవి జయరాజ్, రచయిత డా.సంగిశెట్టి శ్రీనివాస్, విమర్శకులు డా.కోయి కోటేశ్వరరావు, రచయిత డా.పసునూరి రవీందర్, జానపద కళాకారులు దరువు ఎల్లన్న, అంతుడుపుల నాగరాజు, ఏపూరి సోమన్న, డా. ఒగ్గు రవి కుమార్, నేర్నాల కిషోర్, పల్లె నరసింహ, దర్శకుడు డా.ఖాజా పాషా, కవి డా.యాకూబ్, రచయిత డా.జూకంటి జగన్నాథం, కళాకారుడు దరువు అంజన్నలను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా

నేర్నాల కిషోర్ నియామకం పట్ల నగారే బృందం హర్షం. హుజురాబాద్ ప్రాంతానికి చెందిన నేర్నాల కిషోర్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ సభ్యునిగా నియమించడం పట్ల హుజురాబాద్ కు చెందిన నగారే కళాబృందం హర్షం వ్యక్తం చేశారు. నగారే బృందం అధ్యక్షుడు చోల్లేటి రాజన్న, ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, గాయకులు, రచయిత టి మురళి మధు, గాయకుడు వడ్లకొండ అనిల్ కుమార్, బాబ్జి, డప్పు సురేష్, తుమ్మనపల్లి రాజు తదితర కళాకారులు హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ సభ్యునిగా నియామకమైన నేర్నాల కిషోర్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!