Social 1080×1350 • Multi-page
01-07-2025 BREAKING NEWS 05:08 PM
swarnodayam.com
Telugu Daily News

విద్యా జ్యోతి పథకం ఎక్కడ!?…బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి హరీష్ వర్మ అప్పని

విద్యా జ్యోతి పథకం ఎక్కడ!?…బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి హరీష్ వర్మ అప్పని
IMG_20250701_170701

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఈ రాష్ట్రంలో అధికారం రావడం కోసం 420 హామీలు 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్న విద్యార్థులకు ఉన్నత చదువును అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి హరీష్ వర్మ అప్పని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని విద్యాజ్యోతి పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఉన్నత చదువు అందించాలని పదవ తరగతి పాసైన విద్యార్థులకు 10వేల రూపాయలు, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 15వేల రూపాయలు, గ్రాడ్యుయేట్ పూర్తయిన విద్యార్థులకు 25,000 పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తయిన విద్యార్థులకు 1,00,000 వారికి ఇస్తానని చెప్పి 19 నెలలు గడుస్తున్న విద్యాజ్యోతి పథకం ఎక్కడ? అని హరీష్ వర్మ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర విడి విద్యా శాఖకు చదువుకున్న జ్ఞానవంతులైన వ్యక్తులను విద్యాశాఖ మంత్రిగా నియమించాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటుకు కేసులో జైలుకుపోయిన దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకుండా వెంటనే విద్యాశాఖకు మంత్రి నియమించి విద్యా జ్యోతి పథకాన్ని అమలు చేయాలని విద్యను నిర్వీర్యం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయని వెంటనే ఫీజ్ రియంబర్స్మెంట్ మెంట్ ని విడుదల చేసి విద్య హక్కు చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీషవర్మ డిమాండ్ చేశారు.

బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి హరీష్ వర్మ అప్పని

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!