01-07-2025 NORMAL NEWS 06:48 PM
swarnodayam.com
Telugu Daily News
01-07-2025 06:48 PM By Mandala Yadagiri

ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు..

ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు..
IMG-20250701-WA0188

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రాథమిక డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్బిఎస్ కే సిబ్బంది, డిప్యూటీ డిఎంహెచ్వో కార్యాలయ సిబ్బంది, చేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ చందుని, వైద్యాధికారి డాక్టర్ మధుకర్ ను, పల్లె దావకాన వైద్యాధికారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యాం నాయక్, ఆర్ బి ఎస్ కే సిబ్బంది డాక్టర్ సరిత, డాక్టర్ రేఖ, డాక్టర్ ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288

వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని కేక్ కట్ చేస్తున్న డిప్యూటీ డీఎంహెచ్వో చందు, వైద్యులు..

ప్రపంచ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్న డిప్యూటీ డిఎంహెచ్వో చందు, వైద్యులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!