Social 1080×1350 • Multi-page
01-07-2025 BREAKING NEWS 08:42 PM
swarnodayam.com
Telugu Daily News

డాక్టర్ బీవీ పట్టాభిరామ్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం

డాక్టర్ బీవీ పట్టాభిరామ్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం
IMG-20250701-WA0201

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక వైద్యుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇంద్రజాల విద్య ద్వారా మూఢ నమ్మకాల నుంచి ప్రజలను జాగృతం చేయడంలో పట్టాభిరామ్ ఎంతో కృషి చేశారని గుర్తుచేసుకున్నారు.

తన ఇంద్రజాల విద్య ద్వారా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేసిన పట్టాభిరామ్ లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. పట్టాభిరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మృతి చెందిన ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక వైద్యుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!