Social 1080×1350 • Multi-page
02-07-2025 BREAKING NEWS 02:58 PM
swarnodayam.com
Telugu Daily News

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం అభివృద్ధికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రూ.రూ.1,01,116 విరాళం

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం అభివృద్ధికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రూ.రూ.1,01,116 విరాళం
IMG-20250702-WA0092

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (కమలాపూర్): హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండలం భింపల్లి గ్రామంలో పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం అభివృద్ధి నిమిత్తం హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తమ సొంత డబ్బులు రూ.1,01,116/- (ఒక లక్ష వెయ్యి నూట పదహారు రూపాయలు) విరాళంగా అందజేశారు.

ఈ విరాళాన్ని కమలాపూర్ సీనియర్ నాయకులు తిరుపతిరావు, మాజీ జడ్పీటీసీలు ఏం నవీన్, లక్ష్మణ్, PACS వైస్ చైర్మన్ ఇంద్రసేనరెడ్డి, కేడిసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, దేవేందర్ రావు, రాజమౌళి, కాజా అసోవోద్దీన్, శ్రీధర్ రావు కలిసి భింపల్లి గ్రామంలోని గౌడ్ కులస్తులకు మరియు గ్రామ ప్రజలకు అధికారికంగా అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యే పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, దేవాలయ అభివృద్ధికి ఇంత పెద్ద మొత్తంలో విరాళాన్ని అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

————————————-++++++————————

@పత్రికా ప్రకటన(యాడ్స్)&

————————–++++++++——————–

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!