03-07-2025 NORMAL NEWS 04:01 PM
swarnodayam.com
Telugu Daily News
03-07-2025 04:01 PM By Mandala Yadagiri

టాప్ర ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం

టాప్ర ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం
IMG-20250703-WA0069

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో సైదాపూర్ రోడ్డులోని స్థానిక వెంకటేశ్వర మ్యారేజ్ బ్యూరో కార్యాలయంలో ఇటీవల ఉపాధ్యాయునిగా పదవీ విరమణ పొందిన భారత ప్రభాకర్ ను టాప్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శనిగరం నరేందర్, చీకట్ల సమ్మయ్య ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న టాప్రా కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, గౌరవాధ్యక్షుడు కట్ట నాగభూషణాచారి మాట్లాడుతూ గత 30 సంవత్సరములుగా ఉపాధ్యాయునిగా, రిసోర్స్ పర్సన్ గా భావిభారత పౌరులైన విద్యార్థినీ విద్యార్థులకు ఉత్తమ సేవలను అందించిన భారత ప్రభాకర్ ను అభినందించారు. పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించ కుండా, ఏప్రిల్ 2024 నుండి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇప్పటివరకు గ్రాట్యుటీ, కమ్యూ టేషన్ చెల్లించకపోవడం విచారించదగ్గ విషయమని అన్నారు.అదే విధంగా ఐదు డిఏ లకు గాను ఒకటే డి ఏ ను మంజూరు చేసి, జూలై 2023 నుండి నూతన పి ఆర్ సి ని అమలు చేయకుండా తాత్సారం చేయడం గర్హించ దగ్గ విషయమని, వెంటనే మిగతా డీఏలను విడుదల చేస్తూ,నూతన పి ఆర్ సి ని జూలై 2023 నుండి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెన్షనర్స్, ఉద్యోగులకు ఈ హెచ్ ఎస్ స్కీమును తక్షణమే అమలుపరుస్తూ, పెన్షనర్ల ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమములో జిల్లా ఉపాధ్యక్షులు బొంగోని వెంకటయ్య, రావికంటి రామకృష్ణయ్య, హుజురాబాద్ శాఖ కోశాధికారి మండల వీరస్వామి, ఉపాధ్యక్షులు చొల్లేటి మల్లారెడ్డి, జమ్మికుంట శాఖ అధ్యక్షుడు గరిగే చంద్రయ్య, సంఘ బాధ్యులు తాటిపాముల కనకయ్య, తౌటం శ్రీహరి, దొంత హరికిషన్, గుడిపాటి స్వామిరెడ్డి, కంది రాజిరెడ్డి, గాజర్ల బుచ్చిరాజం, పెద్ద పేట రమేష్, గాజ గంగయ్య, కుసుమ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288
రిటైర్డ్ టీచర్ భారత ప్రభాకర్ ను సన్మానిస్తున్న టాప్రా నాయకులు

టాప్రా సభ్యత్వం తీసుకుంటున్న రిటైర్డ్ టీచర్ ప్రభాకర్

——————–++++++————————-

*పత్రికా ప్రకటనలు(యాడ్స్)*

—————+++++++———————-

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!