03-07-2025 NORMAL NEWS 08:25 PM
swarnodayam.com
Telugu Daily News
03-07-2025 08:25 PM By Mandala Yadagiri

హుజూరాబాద్ లో నామ మాత్రంగా కమర్షియల్ ట్యాక్స్ అధికారుల తనిఖీలు.. – రోజంతా వెతికిన సరిపోని సమయం.. రెండు మూడు గంటల్లోనే తిరుగు ప్రయాణం!?

హుజూరాబాద్ లో నామ మాత్రంగా కమర్షియల్ ట్యాక్స్ అధికారుల తనిఖీలు.. – రోజంతా వెతికిన సరిపోని సమయం.. రెండు మూడు గంటల్లోనే తిరుగు ప్రయాణం!?
IMG_20250703_201928

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
హుజురాబాద్ పట్టణంలోని ఓ షాపులో కమర్షియల్ టాక్స్ అధికారులు గురువారం తనిఖీ నిర్వహించారు. హుజురాబాద్ పట్టణంలోని ఇందిరామార్గ్ లో రాందేవ్ హోల్ సేల్ షాప్ లో వారు తనిఖీ చేయగా ఈ సందర్భంగా షాప్ లో ఉన్న స్టాకు రిజిస్టర్ లో ఉన్న స్టాకు తేడా ఉందో లేదో పరిశీలించారు. షాపుపై వచ్చిన ఫిర్యాదు మేరకు వారు తనిఖీలు నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నారని వారు తెలిపారు. ఈ తనిఖీల్లో సీటీవో కవిత, ఏసిటివో లు శంకర్, ఎమ్ఏ భారీ, జూనియర్ సహాయకులు సునీత, కృష్ణవేణి, కార్యాలయ సిబ్బంది లౌడ్య రాజు తదితరులు పాల్గొన్నారు. అయితే హుజురాబాద్ పట్టణంలో జీరో వ్యాపారం నిర్వహించే దుకాణాలు ఐదారు ఉండగా కేవలం ఒకే దుకాణాన్ని నామమాత్రంగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీ చేసి మిగతా వాటిని వదిలేసి వెళ్లడంలో ఆంతర్యం ఏమిటో అంత చిక్కడం లేదు. రాందేవ్ దుకాణంలో తనిఖీ చేస్తుండగానే మిగతా దుకాణదారులు జీరో వ్యాపారం నిర్వహించేవారు దుకాణాలకు తాళాలు వేసి పరాయణం చిత్తగించడం పలువురిని విస్మయానికి గురిచేసింది. అంతేగాక తనిఖీకి వచ్చిన అధికారులు మేము చెప్పేంతవరకు విలేకరులు తమ ఇష్టం వచ్చినట్లు రాయకండి అంటూ ఉత్తుత్తి సలహాలు ఇవ్వడం పాత్రికేయులను ఆలోచింపజేసింది. జీరో వ్యాపారం చేసే వారి గురించి తెలిసినవారు తనిఖీ కట్టిన అధికారులు చేతులు తడుపూక్కుంటూ వెళ్లారని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పలు దుకాణాలు జీరో వ్యాపార నిర్వహించేది ఉండగా కేవలం ఒకే షాపును తనిఖీ చేయడం, దానిని కూడా నామమాత్రంగా నిర్వహించడం అధికారుల తనిఖీ పట్ల విమర్శలకు తావిస్తుంది.

రాందేవ్ హోల్ సేల్ షాప్ లో తనిఖీ చేస్తున్న కమర్షియల్ ట్యాక్స్ అధికారులు..

——————–++++++++——————-

*పత్రికా ప్రకటనలు(యాడ్స్)*

———————+++++++++—————–

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!