03-07-2025 NORMAL NEWS 11:48 PM
swarnodayam.com
Telugu Daily News
03-07-2025 11:48 PM By Mandala Yadagiri

ఇంటింటికి వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

ఇంటింటికి వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని పలువురు లబ్ధిదారులకు గురువారం హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి సిఎంఆర్ ఎఫ్ చెక్కులను వారి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి తాను అండగా ఉంటానని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొందరికి మాత్రమే వస్తున్నాయని అన్నారు. కాగా 29 మంది లబ్ధిదారులకు 8,35,000 రూపాయల విలువగల చెక్కులను ఆయన లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబాలను ఆయన సందర్శించి పరామర్శించారు తన ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులకు తెలిపారు.

————————-++++++++——————–

@పత్రికా ప్రకటనలు(యాడ్స్)&

———————–+++++++++++———

————————-++++++—————-

#పత్రిక ప్రకటనలు (యాడ్స్)@

————–++++++————————-

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!