04-07-2025 NORMAL NEWS 12:11 AM
swarnodayam.com
Telugu Daily News
04-07-2025 12:11 AM By Mandala Yadagiri

జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూపాకలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూపాకలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
IMG_20250704_000610

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మండలం జూపాక గ్రామంలో గురువారం జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగినట్లు ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి జయపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గుడిపాటి సరిత తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని 100మందికి పైగా నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స అవసరమైన వారికి హైదరాబాదులో శస్త్ర చికిత్స చేయించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఉచితంగా మందులను అందజేశారు. గ్రామస్తులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఉచిత నేత్ర వైద్య శిబిరంకు వచ్చిన ప్రజలు

———————++++++++——————

@పత్రిక ప్రకటనలు (యాడ్స్)&

—————+++——-;;;;;;——————-

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!