Social 1080×1350 • Multi-page
04-07-2025 BREAKING NEWS 05:23 PM
swarnodayam.com
Telugu Daily News

హైదరాబాద్ కు భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు..

హైదరాబాద్ కు భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు..
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఐఎన్డీ అలయన్స్ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న “జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్” కార్యక్రమంలో భాగంగా, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు శుక్రవారం ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు, హుజురాబాద్ మండలంతో పాటు పట్టణ, నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు చేరుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు “జై కాంగ్రెస్… జై జై కాంగ్రెస్” అనే నినాదాలతో కార్యక్రమ ప్రాంగణాన్ని ఉద్వేగభరితంగా మార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ విలువలు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక సమానత్వం వంటి అంశాలపై నేతలు ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ పునరుద్ధానానికి ఈ కార్యక్రమం ఒక కొత్త దిశగా నిలుస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు.

చలో హైదరాబాద్కు తరలి వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులు..

———————+++++++——————-

&పత్రికా ప్రకటనలు(యాడ్స్)@

——————–+++++++——————–

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!