Social 1080×1350 • Multi-page
04-07-2025 BREAKING NEWS 08:15 PM
swarnodayam.com
Telugu Daily News

అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన.. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు.. – హుజురాబాద్ ఫైర్ స్టేషన్ ఫైర్ మన్ వి సురేందర్

అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన.. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు.. – హుజురాబాద్ ఫైర్ స్టేషన్ ఫైర్ మన్ వి సురేందర్
IMG_20250704_201229

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో శుక్రవారం హుజురాబాద్ ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఫైర్ స్టేషన్ సిబ్బంది బాల బాలికలకు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆయిల్ స్టోర్స్ లలో ప్రమాదాలు జరిగినప్పుడు ఏలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో ప్రయోగపూర్వకంగా వివరించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఫైర్ స్టేషన్ సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎలా పని చేస్తారు అన్న విషయాన్ని కులం కష్టగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తిరుమల ఉపాధ్యాయులు పీ ఈశ్వర్ రెడ్డి, రాములు, ఆసియా, మారుతి ప్రసాద్ స్వామిరావు, సదానందం, హుజురాబాద్ ఫైర్ స్టేషన్ ఫైర్ మన్ వి సురేందర్, సందీప్, శివారెడ్డి, చంద్రశేఖర్, ఆపరేటర్ ప్రసాద్ రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288

అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఫైర్ సిబ్బంది..‌

——————–++++++++——————–

#పత్రికా ప్రకటనలు (యాడ్స్)&

——————+++++++—————-

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!