Social 1080×1350 • Multi-page
04-07-2025 BREAKING NEWS 09:06 PM
swarnodayam.com
Telugu Daily News

శాలపల్లి పాఠశాలకు ఆల్కలైన్ వాటర్ ప్యూరీఫైడ్ విరాళం.

శాలపల్లి పాఠశాలకు ఆల్కలైన్ వాటర్ ప్యూరీఫైడ్ విరాళం.
IMG-20250704-WA0136

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోనీ శాలపల్లి ఎంపీపీ ఎస్ పాఠశాలకు దాదాపు రూ.15,000/- రూపాయిలు విలువ కలిగిన ఆల్కలైన్ వాటర్ ప్యూరీఫైడ్ ను డాక్టర్ మ్యాదర శ్రీనివాస్ విరాళంగా అందించారు. ఈ పాఠశాల నుండి నేను చాలా నేర్చుకున్నాను అని అన్నారు. అలాగని నేను ఈరోజు కొంత రుణం తీర్చుకునే అవకాశం నాకు మీరు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. వారి తల్లి దండ్రులు మ్యాధర ప్రమీల- ప్రభాకర్ లతో వాటర్ ప్యూరిఫైయర్ మిషన్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. శారద, ఇక నుండి నీళ్ల బాటిల్స్ మోయాల్సిన అవసరం లేదని వారికి శుద్ధమైన నీరు ఇప్పుడు పాఠశాలలోనే అందించ బడుతుందని పిల్లలకు కాస్త బరువు భారం తగ్గించినందుకు డాక్టర్.మ్యాదర శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో దాతలు చిన్నక్క మల్లారెడ్డి, జడల అశోక్, తాజా మాజీ ఉపసర్పంచ్ విద్యా సాగర్ రెడ్డి, హైమావతి, కృష్ణ, పాత్రికేయ మిత్రులు గన్ను శ్రీనివాస్, తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఉపాధ్యాయుడు ఎం.సతీష్, పద్మశాలి సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు వేముల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

శాలపల్లి పాఠశాలకు ఆల్కలైన్ వాటర్ ప్యూరీఫైడ్ విరాళంగా అందజేసిన డాక్టర్ మ్యాదర శ్రీనివాస్..

———————-+++++++——————-

#పత్రికా ప్రకటనలు (యాడ్స్)&

—————–+++++++—————–

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!