Social 1080×1350 • Multi-page
04-07-2025 BREAKING NEWS 10:17 PM
swarnodayam.com
Telugu Daily News

కన్నుల పండుగగా కొనసాగుతున్న శ్రీ వారాహి దేవి నవరాత్రోత్సవాలు… శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు.. – ముగిసిన వేడుకలు.

కన్నుల పండుగగా కొనసాగుతున్న శ్రీ వారాహి దేవి నవరాత్రోత్సవాలు… శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు.. – ముగిసిన వేడుకలు.
IMG_20250704_221233

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని హుజురాబాద్ పట్టణంలోని శ్రీ సంతోషిమాత సహిత నవగ్రహ సహిత అయ్యప్పస్వామి దేవాలయంలో గత 9 రోజులుగా శ్రీ వారాహిదేవి నవరాత్రో త్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈరోజు 9వ రోజులో భాగంగా అమ్మవారు శుక్రవారం భక్తులకు శాఖాంబరిగా దివ్యదర్శనం ఇచ్చారు. ముందుగా గోపూజ, శాకాంబరిపూజ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు అమ్మవారిని కూరగాయలతో ఆలయ అర్చకులు సుజిత్ కుమార్ అలంకరించారు. ఈరోజు అలంకారంలో వాడిన కూరగాయలు రేపు శనివారం మధ్యాహ్నం 12:30 కు భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తారు. కావున భక్తులు విచ్చేసి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి చల్లని ఆశీస్సులు పొందాలనీ అయ్యప్ప దేవాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు.

ఈరోజు అమ్మవారిని కూరగాయలతో ఆలయ అర్చకులు సుజిత్ కుమార్ అలంకరించిన దృశ్యం.

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
అమ్మవారికి

ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న అర్చకులు..

ప్రత్యేక పూజలకు పెద్ద ఎత్తున పాల్గొన మహిళల భక్తులు..

———————–+++++++++—————

&పత్రికా ప్రకటనలు(యాడ్స్)#

———————+++++++——————

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!