Social 1080×1350 • Multi-page
04-07-2025 BREAKING NEWS 11:53 PM
swarnodayam.com
Telugu Daily News

సిర్సపల్లిలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం… – 150 మందికి పరీక్షలు, 50 మందికి ఆపరేషన్ల కొరకు శంకర్ ఐ హాస్పిటల్‌కు తరలింపు.

సిర్సపల్లిలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం… – 150 మందికి పరీక్షలు, 50 మందికి ఆపరేషన్ల కొరకు శంకర్ ఐ హాస్పిటల్‌కు తరలింపు.
IMG_20250704_234644

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూలై 4: హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో శుక్రవారం జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం గ్రామస్తులకు ఎంతో ప్రయోజనకరంగా నిలిచింది. జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సరిత – జైపాల్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో ఈ శిబిరం విజయవంతంగా పూర్తయిందని నిర్వాహకులు వెల్లడించారు. గ్రామ ప్రజల కంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి వందలాది మంది ఉదయం నుంచే తరలి వచ్చారు. అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల బృందం సుమారు 150 మందికి పూర్తిస్థాయి కంటి పరీక్షలు నిర్వహించింది. అత్యాధునిక పరికరాలతో కంటిచూపు, శుక్లాలు, గ్లకోమా వంటి వివిధ రకాల కంటి సమస్యలను పరిశీలించారు.
పరీక్షల అనంతరం, ప్రాథమిక అంచనా ప్రకారం 50 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు. సరైన సమయంలో శస్త్రచికిత్సలు చేయించుకోకపోతే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తించి, వారికి తక్షణమే ఆపరేషన్లు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ 50 మందిని మెరుగైన వైద్యం, శస్త్రచికిత్సల కోసం హైదరాబాద్‌లోని ప్రఖ్యాత శంకర్ ఐ హాస్పిటల్‌కు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఆపరేషన్ల ఖర్చులతో సహా పూర్తి వైద్య ఖర్చులను జయన్న ఫౌండేషనే భరిస్తుందని చైర్మన్ సరిత జైపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.
జయన్న ఫౌండేషన్ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణకు అందిస్తున్న ఈ సేవలను గ్రామస్తులు ఎంతగానో అభినందించారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాల ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. సరిత జైపాల్ రెడ్డి సేవానిరతిని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని గ్రామస్తులు కోరారు.

ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న జయన్న ఫౌండేషన్ నిర్వాహకుడు జైపాల్ రెడ్డి…

—————-++++++++———————

&పత్రికా ప్రకటనలు (యాడ్స్)#

——————-+++++++++—————–

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!