Social 1080×1350 • Multi-page
06-07-2025 BREAKING NEWS 08:03 PM
swarnodayam.com
Telugu Daily News

వాణిజ్య పన్నుల శాఖలో ఏసిటిఓలకు డిసిటిఓ, డిసిటిఓ లకు సిటిఓ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి.. – తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్

వాణిజ్య పన్నుల శాఖలో ఏసిటిఓలకు డిసిటిఓ, డిసిటిఓ లకు సిటిఓ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి.. – తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్
IMG-20250706-WA0019

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో ఖాళీగా ఏర్పడిన వాణిజ్య పన్నుల శాఖ అధికారి డిసిటిఓ సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారి ఖాళీ పోస్టులలో వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లను ఇవ్వడానికి వాణిజ్య పన్నుల శాఖలో డీపీసీ డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కే హరితకు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కారం కొరకు ఎంతో కృషి చేస్తున్న వాణిజ్య పనుల శాఖ కమిషనర్ కే హరితకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అభినందనలు తెలియజేసారు. మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ఇప్పటికైనా వాణిజ్య పన్నుల శాఖలో ఖాళీగా ఏర్పడిన పోస్టులతో పాటు ఇటీవల పదవి విరమణ పొందిన ఖాళీ పోస్టులలో కూడా వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా సీనియర్ అసిస్టెంట్లకు సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు డిసిటిఓ గా డీసీటీవోలకు సిటివోలుగా సిటిఓ లకు అసిస్టెంట్ కమిషనర్ వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా అసిస్టెంట్ కమిషనర్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు జాయింట్ కమిషనర్ గా జాయింట్ కమిషనర్ కు అడిషనల్ కమీషనర్లు ప్రమోషన్లను కల్పించి ఖాళీగా ఏర్పడిన అన్ని పోస్టులలో వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రాష్ట్ర రెవిన్యూ మరియు ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజ్వి, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కే హరిత లకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేస్తూ వెంటనే చొరవ తీసుకొని డిపార్ట్మెంటల్ డిసిపి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. అర్హత గల మరియు సీనియార్టీ ప్రకారం రోస్టర్ పాయింట్ ప్రకారం ప్రమోషన్లను కల్పించినట్లయితే చాలా బాగుంటుందని అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు.

తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్

—————–+++++++++—————–

&పత్రికా ప్రకటనలు (యాడ్స్)&

—————–++++++++—————–

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!